: ప్రారంభమైన సీతారాముల కల్యాణం
భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం మిధిలా స్టేడియంలో ప్రారంభమయింది. కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు కిక్కిరిశారు. ప్రభుత్వం తరపునుంచి సీతారాముల దంపతులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. వివాహానికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య హాజరయ్యారు. మరోవైపు శ్రీరామనవమి సందర్బంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ శుభాకాంక్షలు తెలిపారు.