: మన కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది... అందుకే ఆనందంగా ఉన్నాం: చంద్రబాబు


మన దగ్గరున్న కుటుంబ వ్యవస్థ చాలా గొప్పదని... అందుకే మనం చాలా సంతోషంగా ఉన్నామని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అదే అమెరికాలో అయితే సంపద ఉన్నా వారికి సంతోషం ఉండదని తెలిపారు. పేదరికాన్ని నిర్మూలించి, మెరుగైన జీవితాన్ని అందించడమే తన లక్ష్యమని అన్నారు. గ్రామాలను ఆకర్షణీయంగా తయారు చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులను వినియోగించుకుందామని చెప్పారు. ప్రజల సహకారం లేనిదే సమస్యలు పరిష్కారం కావని... దీనికోసం ప్రజల్లో చైతన్యం రావాలని అన్నారు. నీటిని సంరక్షించుకోవడం కోసం ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. అందరికీ రక్షిత మంచినీరు, నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని తెలిపారు. సౌరశక్తి, ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని పెంచుతామని చెప్పారు. మాతా శిశు మరణాలు, బాల కార్మిక వ్యవస్థలను నిర్మూలిస్తామని అన్నారు. అంగన్ వాడీల్లో, స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మిస్తామని, వసతులు కల్పిస్తామని చెప్పారు. గ్రామాల దత్తత కోసం ఒకరికన్నా ఎక్కువ మంది వస్తే ఏం చేయాలనే దానిపై కమిటీ వేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News