: నా వర్గం వారిని కాపాడుకునేందుకే ఐఎస్ఐఎస్ లో చేరేందుకు బయలుదేరా: పోలీసులకు వెల్లడించిన సల్మాన్


ఐఎస్ఐఎస్ లో చేరేందుకు దుబాయ్ మీదుగా సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుబడిన ఇంజినీర్ సల్మాన్ మొయినుద్దీన్ (32) పోలీసు విచారణలో పలు విషయాలను వెల్లడించాడు. తన వర్గం వాళ్లను కాపాడుకునేందుకే ఐఎస్ఐఎస్ తో కలసి పని చేసేందుకు సిరియా బయలుదేరానని స్పష్టం చేశాడు. దౌలాన్ న్యూస్ అనే ఫేస్ బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఐఎస్ గురించి ప్రచారం చేశానని వెల్లడించాడు. దీన్ని అమెరికా అధికారులు గుర్తించారని... ఈ క్రమంలో, తన వీసా గడువును పెంచకుండా ఇండియాకు తిరిగి పంపించి వేశారని చెప్పాడు. టూరిస్ట్ వీసాపై దుబాయ్ వెళ్లి, అక్కడున్న తన ప్రియురాలిని పెళ్లాడి, అక్కడ నుంచి సిరియా వెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలిపారు. మొయినుద్దీన్ ల్యాప్ టాప్ ను సైబరాబాద్ పోలీసులు పరిశీలిస్తున్నారు. అతని ఫేస్ బుక్, ట్విట్టర్లో ఉన్న వాళ్లనూ పోలీసులు ప్రశ్నించబోతున్నారు.

  • Loading...

More Telugu News