: స్వల్ప మార్పులతో కొత్త సిలబస్ ఉంటుంది: టీఎస్ పీఎస్సీ
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిలబస్ కమిటీ సమావేశం ముగిసింది. వివిధ పరీక్షలకు సంబంధించిన సిలబస్ పై ఈ సమావేశంలో చర్చించారు. భేటీ అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ, స్వల్ప మార్పులతో కొత్త సిలబస్ ఉంటుందని తెలిపారు. ఈ నెల 29న మరోసారి భేటీ కావాలని నిర్ణయించామని చెప్పారు. 30న తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకుని సిలబస్ లో మార్పులు, చేర్పులు చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.