: విశాఖలో విద్యాసంస్థ ఏర్పాటుకు కుమార మంగళం బిర్లా సుముఖత వ్యక్తం చేశారు: చంద్రబాబు
తెలవిగలవారు, బాగా చదువుకున్న వారు ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉన్నత విద్యలో ఏపీ ఏపీ ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు. గతంలో తనను కలిసినప్పుడు, విశాఖలో విద్యాసంస్థను ఏర్పాటు చేయాలని కుమార మంగళం బిర్లాను కోరానని... దానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని తెలిపారు. విశాఖ ప్రపంచ స్థాయి నగరంగా అవతరిస్తుందని అన్నారు. ఐఐఎం శంకుస్థాపన సందర్భంగా ప్రసంగించిన ఆయన, ఈ విషయాలను తెలిపారు. అప్పటి ప్రభుత్వం రాష్ట్ర విభజనను హేతుబద్ధతతో చేయలేదని... ఏదో చేయాలి కాబట్టి, తూతూ మంత్రంగా పని కానిచ్చేశారని మండిపడ్డారు. వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలు పోరాడితే ఐఐఎం, ఐఐటీ, నిట్, గిరిజన యూనివర్శిటీ మొదలైనవి ప్రకటించారని చెప్పారు.