: ఊర్లు తిరిగేందుకే సీఎం అయినట్టున్నావ్...!: జానారెడ్డి ఎద్దేవా
కేవలం ఊర్లు పట్టుకు తిరిగేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పదవిలోకి వచ్చినట్టు ఉందని ప్రతిపక్షనేత జానారెడ్డి ఎద్దేవా చేశారు. జిల్లాల పర్యటనే తన మొదటి పనిగా ఆయన భావిస్తున్నారని జానారెడ్డి నేడు విమర్శించారు. హామీలు ఇవ్వాలనుకుంటే హైదరాబాద్ నుంచి ఇవ్వొచ్చని, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు రబీకి నీళ్లిచ్చే అంశంపై ఇప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని, కేసీఆర్ మాత్రం జిల్లాల్లో పర్యటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కృష్ణపట్నం విద్యుత్ కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత కేసీఆర్ పై వుందని, రాష్ట్రం ఉమ్మడిగా ఉన్నప్పుడు రెండో పంటకు అందిన నీరు ఇప్పుడెందుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు.