: పాల ప్యాకెట్ కొనుక్కు వచ్చేసరికి కొడుకు సహా అదృశ్యమైన భర్త!


పాల ప్యాకెట్ కొనుక్కు వచ్చేసరికి తన భర్త, కుమారుడు అదృశ్యం అయ్యారని జేఎన్టీయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ సౌజన్య శ్రీదేవి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం,హైదరాబాద్ పరిధిలోని ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్న సౌజన్య శ్రీదేవి, డాక్టర్ దిలీప్‌ కుమార్ (40) దంపతులు గతేడాది అక్టోబర్ 25న కుమారుడు సాయి (4)తో కలిసి షాపింగ్‌ కు వచ్చారు. ప్రగతినగర్ విజేత సూపర్‌ మార్కెట్ వద్ద కారు నిలిపి పాల ప్యాకెట్ కోసం సౌజన్య సూపర్ మార్కెట్‌ లోకి వెళ్ళింది. తిరిగి వచ్చి చూసేసరికి కారులో ఉండాల్సిన దిలీప్‌, సాయి కనిపించలేదు. బంధువుల ఇళ్లు, చుట్టు పక్కల ప్రాంతాల్లో వాకబు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News