: రోగులే ఇక్కడ డాక్టర్లు... ముంబై ఆసుపత్రి దీనస్థితి!
అది ముంబైలో 120 ఏళ్ల క్రితం ప్రారంభమైన కుష్టు వ్యాధి చికిత్సా కేంద్రం. ఇప్పుడక్కడ డాక్టర్లు లేరు. రోగులు మాత్రం వున్నారు. మరి వారికి చికిత్స ఎలా అందుతోంది అనుకుంటున్నారా? రోగులే ఒకరికి ఒకరు వైద్యం చేసుకుంటున్నారు. ఒకరిద్దరు డాక్టర్లు వచ్చినా తమ గాయాలకు వారు కనీసం కట్లు కూడా కట్టడంలేదని రోగులు ఆరోపిస్తున్నారు. సుమారు 100 మంది రోగులున్న ఈ ఆసుపత్రిలో కేవలం నలుగురు డాక్టర్లు, ఒక వార్డ్ బాయ్ మాత్రమే వున్నారు. ఇక్కడ ఐదు దశాబ్దాల నుంచి చికిత్స పూర్తికాని రోగులు సైతం వున్నారని తెలుస్తోంది. గదులు శుభ్రం చేసుకోవడం వంటి పనులను సైతం రోగులే చేసుకుంటున్నారు. ఆసియాలోనే అత్యధిక బడ్జెట్ తో సేవలందిస్తున్న బీఎంసీ (బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రిపై అధికారుల వైఖరి మారాలని రోగులు కోరుతున్నారు.