: ఆంధ్ర రాజధాని ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వ బ్యానర్లు!
నవ్యాంధ్ర రాజధాని పరిధిలో అధికారుల పొరపాట్లు తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. రేపు జరగాల్సిన పల్స్ పోలియోకు ఏర్పాట్లలో గందరగోళం చెలరేగింది. రాజధాని ప్రతిపాదిత గుంటూరు జిల్లా తాడేపల్లి మండల పరిధిలో పోలియో చుక్కలు వేయాల్సిన కార్యకర్తలకు అందించిన సామగ్రిలో తెలంగాణ ప్రభుత్వ బ్యానర్లు వున్నాయి. పల్స్ పోలియో ప్రచార సామగ్రి పంపిణీలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పేరిట బ్యానర్లు పంపిణీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.