: అది కిల్లర్ గాలిపటం... మనిషి ప్రాణం తీసింది!


సరదాగా ఎగురవేసిన ఓ గాలిపటం ఆ వ్యక్తి పాలిట మృత్యువుగా మారింది. గాలిలో ఎగురుతున్న గాలిపటం మాంజా, స్కూటర్ పై వెళ్తున్న మొగలయ్య అనే వ్యక్తి గొంతు కోసింది. ఈ ఘటన హైదరాబాద్ పరిధిలోని చందానగర్ సమీపంలో జరిగింది. కూతురుతో కలసి మొగలయ్య వెళుతుండగా మాంజా తెగిన గాలిపటం రహదారిపై ఎగురుతూ మొగలయ్య మెడకు తగిలింది. స్కూటర్ పై వేగంగా వెళుతున్న మొగలయ్య గొంతు తెగడంతో ఆయన అక్కడికక్కడే అదుపుతప్పి కిందపడ్డాడు. ఆ వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్లక్ష్యంగా గాలిపటం ఎగురవేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి బంధువులు డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News