: రేపు విశాఖలో పర్యటించనున్న చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు విశాఖలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా, విశాఖ జిల్లా ఆనందపురం మండలం గంభీరంలో ప్రతిష్ఠాత్మక ఐఐఎంకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ కూడా హాజరవుతున్నారు. ఉదయం 10.15 గంటలకు చంద్రబాబు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. 11 గంటల నుంచి 12 గంటల వరకు శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 2.15 గంటలకు ఆయన హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.