: జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందని అరుణ్ జైట్లీకి తెలిపా: చంద్రబాబు
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి స్పష్టం చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నింటినీ ఇవ్వాలని కోరామని తెలిపారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ విషయాలను వెల్లడించారు. పలువురు మంత్రులతో భేటీ సందర్భంగా, పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక హోదాపై చర్చించామని చెప్పారు. అలాగే, రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయంపై కూడా కేంద్ర మంత్రులతో చర్చ జరిపామని తెలిపారు.