: వార్నర్ అద్భుత ఇన్నింగ్స్... ఆసీస్ జయకేతనం


ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారీ ఇన్నింగ్స్ తో, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ తొలి మ్యాచ్ లో ఆసీస్ చేతిలో ఇంగ్లండ్ జట్టు ఓటమిపాలైంది. 115 బంతుల్లో 18 ఫోర్ల సాయంతో 127 పరుగులు చేసిన వార్నర్... తన జట్టుకు విజయాన్నందించాడు. 235 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్ కేవలం 39.5 ఓవర్లలోనే 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వార్నర్ కు స్మిత్ (37), వాట్సన్ (16), హాడిన్ (16), ఫించ్ (15)లు కొద్దిపాటి సహకారం అందించారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4 వికెట్లను పడగొట్టగా జోర్డాన్, అలి చెరో వికెట్ తీసుకున్నారు. అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... మోర్గాన్ (121) అద్భుత ఇన్నింగ్స్ సాయంతో 234 పరుగులు సాధించింది. అలీ (22), బట్లర్ (28)లు మినహా మరెవరూ మోర్గాన్ కు సహకారం అందించలేక పోవడంతో... ఇంగ్లండ్ జట్టు 47.5 ఓవర్లకే ఆలౌట్ అయింది. ఈ నెల 18వ తేదీ (ఆదివారం) భారత్, ఆస్ట్రేలియాల మధ్య సిరీస్ లో రెండో వన్డే జరగనుంది.

  • Loading...

More Telugu News