: ఆర్టీసీ విభజనను వివాదాస్పదం చేయొద్దు: తెలుగు రాష్ట్రాలకు నితిన్ గడ్కరీ విజ్ఞప్తి


తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ విభజన వివాదాస్పద అంశం కాదని, దీన్ని వివాదాస్పదం చేయవద్దని రెండు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నేటి మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ, ఆర్టీసీ విభజనలో తలెత్తే సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఏపీ రాజధానిని కలిపే మార్గాలు సహా మొత్తం 624 కి.మీ రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ది చేయనున్నట్టు వివరించారు. రాయలసీమ నుంచి నూతన రాజధాని వరకూ వున్న మార్గాలను జాతీయ రహదారులుగా మారుస్తామన్నారు. జాతీయ రహదారుల కోసం చేపట్టే భూసేకరణపై చంద్రబాబు భరోసా ఇచ్చారని, భూ సేకరణలో వచ్చే సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు చెప్పినట్టు గడ్కరీ తెలిపారు. దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి కేంద్రం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News