: స్పైస్ జెట్ నుంచి తప్పుకున్న మారన్ సోదరులు... ఉవ్వెత్తున లేచిన షేర్ విలువ


ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్ లైన్స్ సంస్థ స్పైస్ జెట్ తిరిగి తలెత్తుకు నిలబడే అవకాశాన్ని పొందింది. సంస్థలో 53 శాతం వాటాలు అనుభవిస్తున్న మారన్ కుటుంబం తమ వాటాలు విక్రయించేందుకు అంగీకరించింది. స్పైస్ జెట్ అసలు యజమాని, గతంలో మారన్ కు వాటాలు అమ్మిన అజయ సింగ్ రూ.1500 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చారు. ఈ డీల్ కు సంస్థ బోర్డు సైతం ఆమోదం తెలిపింది. ఈ వార్త అటు సన్ టీవీ, ఇటు స్పైస్ జెట్ ఇన్వెస్టర్లకు ఆనందాన్ని కలిగించింది. దీంతో ఇరు కంపెనీల షేర్ విలువ సుమారు 10 శాతం పెరిగింది. కాగా, పౌర విమానయాన శాఖ నుంచి యాజమాన్య మార్పుకు అనుమతి లభించగానే స్పైస్ జెట్ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తామని అజయ సింగ్ తెలిపారు.

  • Loading...

More Telugu News