: మోదీని పొగడ్తలతో ముంచెత్తిన శశిథరూర్!
తన భార్య సునందా పుష్కర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ నేడు ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శశిథరూర్ పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. నేటి ఉదయం కోల్ కతాలో తాను రచించిన 'ఇండియా శాస్త్ర' పుస్తకావిష్కరణలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, తాను లోక్ సభ సభ్యుడిగా విజయం సాధించిన తరువాత మోదీ స్వయంగా అభినందించారని, ఆ సమయంలో తానెంతో సంతోషించానని తెలిపారు. ఇటీవల 'స్వచ్ఛ భారత్' ప్రచారంలో పాల్గొనాలని మోదీ ఆహ్వానిస్తే, ఆ వెంటనే థరూర్ అంగీకరించిన సంగతి తెలిసిందే. "స్వచ్ఛ భారత్ ఎంతో మంచి కార్యక్రమం. నేను దాన్ని నమ్మాను. అందుకే దానిలో నావంతు బాధ్యత నేను నిర్వహిస్తా" అని ఆయన అన్నారు. కాగా, గతంలో మోదీ షిమ్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సునందా పుష్కర్ ను 'రూ.50 కోట్ల విలువైన గర్ల్ ఫ్రెండ్' అని విమర్శించిన విషయం తెలిసిందే.