: గూడ్స్‌లో నక్కి వచ్చిన యువతి... తీవ్రవాదన్న అనుమానంతో పోలీసుల విచారణ


కోయంబత్తూరు నుంచి చెన్నైలోని కాట్టుపల్లి హార్బర్‌ కు వచ్చిన ఒక గూడ్స్ రైలులో ఓ యువతి నక్కి ఉండడాన్ని భద్రతా దళాలు గుర్తించి ఆమెను అదుపులోకి తీసుకున్నాయి. తమిళనాట పలు నగరాలు తీవ్రవాదుల హిట్‌ లిస్టులో ఉండడంతో పోలీసులు ఏ చిన్న విషయాన్నీ చూసీ చూడనట్టు వదలటం లేదు. ఆమె తీవ్రవాదా? అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. అంతకుముందు ఉత్తర చెన్నై విద్యుత్ కేంద్రానికి సమీపంలో కాట్టుపల్లి వైపుగా వెళ్తున్న ఈ గూడ్స్‌లోని ఓ బోగీలో ఎవరో ఉన్నట్టుగా గుర్తించారు. భద్రతా సిబ్బంది అన్ని బోగీలను పరిశీలించగా, ఓ బోగిలో యువతి దాక్కొని ఉండటంతో ఆమెను అదుపులోకి తీసుకుని, పొన్నేరి డీఎస్పీ శేఖర్‌ విచారిస్తున్నారు. 21 ఏళ్ల ఆ యువతి పేరు స్టాన్లీ అని, ఆంధ్రప్రదేశ్ వాసి అని తెలుస్తోంది. అయితే, ఆమె భద్రతా సిబ్బంది కళ్లు గప్పి రైలులోకి ఎలా ప్రవేశించిందన్న కోణంలో విచారణ సాగుతోంది.

  • Loading...

More Telugu News