: బౌద్ధ ఆలయంలో పోప్ ఫ్రాన్సిస్ పూజలు
కొలంబో పర్యటనలో భాగంగా క్రైస్తవ మత గురువు పోప్ ఫ్రాన్సిస్ ఓ ప్రముఖ బౌద్ధ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. ఆయన రాక సందర్భంగా ఆలయంలో అరుదైన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆలయంలోని స్వర్ణ స్థూపాన్ని కదిలించారు. పోప్ ఫ్రాన్సిస్ లంక పర్యటన మరి కొద్ది గంటల్లో ముగుస్తుందనగా, చివరి నిమిషంలో షెడ్యూల్ లో మార్పు చేస్తూ బౌద్ధ ఆలయానికి వెళ్ళాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఒక భౌద్ధ ఆలయాన్ని పోప్ సందర్శించడం చరిత్రలో ఇది రెండోసారి. 1984లో పోప్ జాన్ పాల్ థాయిలాండులో బౌద్ధ ఆలయాన్ని సందర్శించారు.