: ఇక మల్లయోధుడిగా ఆమిర్ ఖాన్... తదుపరి చిత్రం కోసం కసరత్తులు!


'పీకే'తో వసూళ్లలో తన రికార్డులనే తాను తిరగరాసుకున్న బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ తదుపరి చిత్రం ఏమిటన్న దానిపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అందరి ఊహలకు అందని తీరితో విభిన్న పాత్రలను ఎంచుకునే ఆమిర్... తన తాజా చిత్రంలో మల్లయోధుడి (రెజ్లర్)గా కనిపించనున్నాడట. అంతేకాదు, తన ఇద్దరు కూతుళ్లను రెజ్లింగ్ క్రీడ దిశగా ప్రోత్సహించే తండ్రి పాత్రలో అతడు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాడు. నితేశ్ తివారి తీస్తున్న ‘దంగల్’ చిత్రంలో మెలి తిరిగిన కండరాలతో ఆమిర్ కనిపించనున్నాడు. భారత రెజ్లర్లు గీతా, బబితా కుమారి ఫోగత్ ల ఇతివృత్తం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆమిర్, వారి తండ్రి మహావీర్ ఫోగత్ పాత్ర పోషించనున్నాడు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం ఆమిర్ తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు. క్రీడల నేపథ్యంలో ప్రేక్షకుల నీరాజనాలందుకున్న చక్ దే ఇండియా, మేరీ కామ్, భాగ్ మిల్కా భాగ్ తదితర చిత్రాల తరహాలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకాదరణ పొందడం ఖాయమని ఆమిర్ అంచనాలేస్తున్నాడు.

  • Loading...

More Telugu News