: ఒబామాను కలిసేందుకు తీరిక లేదన్న అమితాబ్!


అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిసేందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కు తీరిక లేదట. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిధిగా హాజరుకావాలని అమితాబ్ కు మోదీ కార్యాలయం ఆహ్వానం పంపితే ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది. తొలుత మోదీ ఆహ్వానాన్ని అమితాబ్ అంగీకరించారని, తరువాత తాను ఢిల్లీకి రాలేనని స్పష్టం చేశారని తెలుస్తోంది. తన నూతన చిత్రం 'షమితాబ్' ప్రమోషన్ కోసం ఏర్పాటు చేసుకొన్న కార్యక్రమాల్లో బిజీగా ఉన్నందునే ఒబామాను కలవలేకపోతున్నాడని సమాచారం.

  • Loading...

More Telugu News