: రూ.ఆరు వందల కోట్లు దాటిన 'పీకే' వసూళ్లు
ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రం కలెక్షన్ల సునామీ ఇప్పట్లో ఆగేలా లేదు. వందేళ్ల భారతీయ సినిమా చరిత్ర రికార్డులను తిరగరాస్తూ పీకే చిత్రం రూ.600 కోట్ల మార్కును దాటింది. ఇండియాలో రూ.475 కోట్లు (గ్రాస్), విదేశాల్లో రూ.160 కోట్ల (గ్రాస్)తో మొత్తం 635 కోట్ల వసూళ్లను సినిమా నమోదు చేసింది. బాలీవుడ్‌లో రూ. 300 కోట్ల నికర వసూళ్లను సాధించిన తొలి హిందీ చిత్రంగా ఇప్పటికే 'పీకే' నిలిచింది. అమీర్ ఖాన్, అనుష్కశర్మ నటించిన ఈ చిత్రం డిసెంబర్ 19 తేదీన విడుదల కాగా, పలు వివాదాలు చుట్టుముట్టిన సంగతి తెలిసిందే.