: కొండలు దిగి తిరుపతి పట్టణంలోకి వస్తున్న చిరుతలు!
ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుపతిలో సంచరిస్తున్న చిరుతల సంఖ్య పెరుగుతోంది. పట్టణంలోని వేదిక్ యూనివర్సిటీ, రుయా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో తరచూ చిరుతలు కనిపిస్తున్నాయి. రెండురోజుల క్రితం మెట్ల మార్గంలో చిరుతను చూసి భక్తులు పరుగులు పెట్టారు. తాజాగా, రుయా ఆసుపత్రిలోని ఐడీహెచ్, టీబీ వార్డుల వద్ద చిరుతపులి కనిపించందని రోగులు చెబుతున్నారు. చిరుత దాడి చేస్తుందేమోనని రోగుల బంధువులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కాగా, చిరుత ఒక జింకను చంపినట్టు తెలుస్తోంది. శేషాచలం అడవులను వదిలి మూడు చిరుతలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.