: కోడి పందేల కోసం పశ్చిమలో క్యూ కట్టిన తెలంగాణ నేతలు
తెలంగాణలో కోడి పందేల సంప్రదాయం లేకపోవడంతో, పందేలపై మక్కువ ఉన్న పలువురు నేతలు పశ్చిమ గోదావరి జిల్లాలో తమ ముచ్చట తీర్చుకున్నారు. స్వయంగా ఎంపీలు, ఎంఎల్ఏలు దగ్గరుండి పాల్గొంటున్న బారులలో తెలంగాణ నేతల సందడి కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రతి నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులే దగ్గరుండి మరీ కోడి పందేలు జరిపించారు. దీంతో పోలీసులు ప్రేక్షక పాత్రకు మాత్రమే పరిమితం అయ్యారు. కోడి పందేల నిర్వహణకు అనుమతించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత కె. రఘురామకృష్ణంరాజు భీమవరం మండలం వెంపలో పందేలను ప్రారంభించారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు బరిలోకి దిగి పందేలకు సై అన్నారు. తెలంగాణ నేతలు ప్రకాష్ గౌడ్, శ్రీశైలం గౌడ్ పందేలను వీక్షించారు. భోగి రోజు ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో జరిగిన పందేల్లో భాగంగా రూ.200 కోట్ల మేర సొమ్ము చేతులు మారినట్లు అంచనా. రాత్రంతా ఫ్లడ్ లైట్ల వెలుగులో పందేలు సాగాయి.