: ప్రవాస భారతీయులకు ఒబామా పెద్దపీట... రెండు కీలక పదవులు
మరో రెండు కీలక పదవుల్లో భారతీయ అమెరికన్లను నియమించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నిర్ణయించారు. నేషనల్ ఇండియన్ గేమింగ్ కమిషన్ (ఎన్ఐజీసీ) ఛైర్మన్‌గా జొనొదేవ్ ఓసియోలా చౌదరిని, ఓవర్సీస్ ప్రైవేట్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ (ఓపీఐసీ) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సభ్యుడిగా దేవన్ జే ఫరేఖ్ ను నియమించినట్లు వైట్ హౌస్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, జూదాన్ని నియంత్రించేందుకు ఉద్దేశించిన ఎన్ఐజీసీలో చౌదరి ప్రస్తుతం ఉపాధ్యక్షుడుగా సేవలందిస్తున్నారు. గతంలో ఇదే సంస్థకు తాత్కాలిక ఛైర్మన్ గా కూడా పనిచేశారు. అమెరికా ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధికి సలహా, సూచనలిచ్చే ఓపీఐసీ, ప్రైవేటు పెట్టుబడిని సంఘటితం చేస్తూ, విదేశీ విధానాన్ని పర్యవేక్షిస్తూ పని చేస్తోంది.