: కాసేపట్లో శబరిమలలో దర్శనం ఇవ్వనున్న మకర జ్యోతి
అయ్యప్ప భక్తుల శరణు ఘోషతో పవిత్ర శబరిమల మారుమోగుతోంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ లక్షలాది మంది భక్తులు అయ్యప్ప నామస్మరణ చేస్తున్నారు. అయ్యప్ప భక్తులు పవిత్రంగా భావించే 'మకర జ్యోతి' కాసేపట్లో దర్శనం ఇవ్వనుంది. భక్తులంతా జ్యోతి దర్శనం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.