: కొత్తగా పెళ్లయిన ఇమ్రాన్ ఖాన్ దంపతుల తొలి పర్యటనకు తీవ్ర వ్యతిరేకత!
ఇటీవల పెషావర్ లో తాలిబాన్ల దాడికి గురైన ఆర్మీ స్కూల్ సందర్శనకు వెళ్ళిన ఇమ్రాన్ ఖాన్ దంపతులకు తీవ్ర నిరసన సెగలు తాకాయి. కొత్తగా పెళ్లయిన ఇమ్రాన్ ఖాన్ దంపతులను స్కూల్ లోకి రాకుండా మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు అడ్డుకున్నారు. ఈ ఘటనను రాజకీయం చేయడానికే ఇమ్రాన్ వచ్చాడని ఆరోపిస్తూ, వారంతా "గో ఇమ్రాన్ గో" అంటూ నినాదాలు ఇచ్చారు. తన సతీమణి రేహం ఖాన్, ఆ ప్రాంత ముఖ్యమంత్రి పర్వేజ్ ఖట్టాక్ లతో కలసి స్కూల్ సందర్శనకు వచ్చిన ఇమ్రాన్ నిరసనల నేపథ్యంలో వెనక్కు వెళ్ళిపోయారు. పెళ్లయిన తరువాత ఇమ్రాన్ తొలి పర్యటన ఇదే కావడం గమనార్హం.