: టీసీఎస్ లో సంక్షోభం!: ఖండించిన యాజమాన్యం


ఐటీ దిగ్గజం టీసీఎస్ సంక్షోభంలో కూరుకుపోయిందని, సంస్థలో ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నారని సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్లలో వెలువడుతున్న పుకార్లను నమ్మవద్దని టీసీఎస్ యాజమాన్యం కోరింది. ఈ మేరకు నేటి మధ్యాహ్నం సంస్థ ఒక ప్రకటన వెలువరించింది. ఇప్పటివరకు కేవలం 2574 మందిని మాత్రమే ఉద్యోగం వీడాలని ఆదేశించామని, ఈ సంఖ్య మొత్తం 3 వేలకు మించి ఉండబోదని సంస్థ తెలిపింది. పనితీరు ఆధారిత నివేదికల మేరకు ఉద్యోగుల తొలగింపు సర్వ సాధారణమేనని, ఉద్యోగుల సంక్షేమంలో తమ సంస్థ మిగతా ఐటీ కంపెనీల కన్నా ముందు ఉంటుందని తెలిపింది.

  • Loading...

More Telugu News