: పదేళ్ల బాలుడికి తుపాకీ ఇచ్చి... రష్యన్ల తలలపైకి కాల్పించిన ఉగ్రవాదులు


ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరిన్ని దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఐఎస్ విడుదల చేసిన ఒక వీడియోలో పదేళ్ల బాలుడి చేత ఇద్దరు వ్యక్తులను హతమారుస్తున్నట్టు ఉంది. రష్యా గూఢచారులుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో ఇద్దరిని ఐఎస్ కాల్చి చంపింది. ఓ బాలుడికి ఏకే-47 తుపాకి ఇచ్చి వీరి తలల్లోకి కాల్పులు జరిపించారు ఉగ్రవాదులు. అంతకుముందు వీరిని తీవ్రంగా హింసించారని తెలుస్తోంది. రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) తనను నియమించిందని మరణించే ముందు ఒక వ్యక్తి చెబుతున్నట్టు వీడియోలో వుంది. సిరియాలో తిరుగుతూ ఐఎస్ యుద్ధవీరుల సమాచారాన్ని తాము చేరవేస్తున్నట్టు ఇద్దరూ అంగీకరించారు.

  • Loading...

More Telugu News