: పద్నాలుగు మంది ఐఎస్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన సిరియా సైన్యం
సిరియాలో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై అక్కడి సైనిక ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. సైన్యం నేడు జరిపిన దాడుల్లో 14 మంది ఐఎస్ తీవ్రవాదులు హతం కాగా, మరో ఆరుగురు ఉగ్రవాదులను ప్రాణాలతో పట్టుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. అశారా, స్వైదాన్ ప్రాంతాల్లో వీరు ఆశ్రయం పొందుతున్నారని తెలిపారు. ఈ వారం మొదట్లో ఐఎస్ కు చెందిన ఒక వాహనాన్ని పేల్చిన ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించారని ఉన్నతాధికారులు తెలిపారు. సిరియా-ఇరాక్ దేశాల సరిహద్దు ప్రాంతమైన డిర్ అల్ జర్ ప్రాంతంలో పట్టు కోసం ఐఎస్ ఉగ్రవాదులు దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.