: బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ దోషే: పాక్ కోర్టు


పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషారఫ్ ను ఆ దేశ కోర్టు హత్య కేసులో దోషిగా నిర్ధారించింది. బలూచ్ నేషనలిస్ట్ పార్టీ నేత నవాజ్ అక్బర్ బుగ్తీ హత్య కేసులో ముషారఫ్ ను పాక్ ప్రత్యేక కోర్టు దోషిగా ప్రకటించింది.హత్యలో ముషారఫ్ ప్రమేయాన్ని నిర్ధారించిన కోర్టు త్వరలో శిక్షను ఖరారు చేయనుంది. 2006లో బుగ్తీ హత్య జరిగింది. ఆ సమయంలో ముషారఫ్ పాక్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. రాజకీయ కారణాల వల్లే బుగ్తీ హత్య జరిగిందని నాడు ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతేకాక ముషారఫ్, బుగ్తీని హత్య చేయించారని కూడా విమర్శలు వినిపించాయి. ఈ కేసు విచారణ చేపట్టిన పాక్ ప్రత్యేక కోర్టు నేడు తీర్పు వెలువరించింది. అంతేకాక కేసు విచారణలో భాగంగా పలు వాయిదాలకు హాజరుకాని ముషారఫ్ పై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News