: కేజ్రీవాల్ పై ఈసారీ మహిళా అభ్యర్థే పోటి... మాజీ మంత్రి కిరణ్ పేరును ఖరారు చేసిన కాంగ్రెస్!


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై పోటికి దిగేందుకు కాంగ్రెస్ లోని ఏ ఒక్క పురుష అభ్యర్థి ధైర్యం చేయడం లేదు. గడచిన ఎన్నికల్లో న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కేజ్రీవాల్ ఏకంగా నాటి ఢిల్లీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షీలా దీక్షిత్ ను మట్టికరిపించారు. దీంతో ఏకంగా ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి ఆమె నిష్క్రమించారు. తాజాగా ఆయన న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఈ దఫా కూడా ఆయనపై పోటీకి మహిళా నేతనే బరిలోకి దింపేందుకు కాంగ్రెస్ నిర్ణయించింది. షీలా దీక్షిత్ మంత్రివర్గంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కిరణ్ వాలియాను పోటీకి దింపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 43 మంది అభ్యర్థులతో నేడు విడుదల చేసిన జాబితాలో ఆ పార్టీ అధిష్ఠానం కిరణ్ వాలియాను కేజ్రీవాల్ పై బరిలోకి దింపుతున్నట్లు తెలిపింది.

  • Loading...

More Telugu News