: కేసీఆర్‌కు గుడి కట్టిస్తానంటున్న కాంగ్రెస్ మాజీ నేత
మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేస్తూ, ప్రత్యేక రాష్ట్రం సాధించిన టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కు గుడి కట్టిస్తానని కాంగ్రెస్ మాజీ నాయకుడు ఆవుల గోపాల్ రెడ్డి ప్రకటించారు. రెండు రోజుల క్రితం గోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్ లో చేరడం గమనార్హం. అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన ఆయన మాట్లాడుతూ, అమరవీరుల స్థూపం పక్కనే కేసీఆర్ గుడి నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ గుడి కోసం తన సొంత డబ్బు ఖర్చు చేయనున్నట్లు పేర్కొన్నారు.