: ఆ మాటంటే వివాదాస్పదం అవుతోంది... ఇండియాలో సంతానంపై చట్టం తేవాల్సిందే: తొగాడియా


భారత్ లో ముస్లింల జనాభా ప్రమాదకర స్థాయిలో పెరుగుతోందని నిజం చెబితే వివాదాస్పదం అవుతోందని, అందువల్ల ఇద్దరు పిల్లల్ని మాత్రమే కనాలనే చట్టం తేవాలని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. తాము చేపడుతున్న ప్రచారం కారణంగా త్వరలోనే హిందువుల జనాభా పెరుగుదల కంటికి కనిపిస్తుందని ఆయన అన్నారు. బరేలిలో జరుగుతున్న వీహెచ్‌పీ వ్యవస్థాపక దినోత్సవాల్లో తొగాడియా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ముస్లింలను బుజ్జగిస్తున్నాడని ఆయన విమర్శించారు. కాగా. హిందూ మత వృద్ధి కోసం ఒక్కో మహిళ నలుగురు పిల్లల్ని కనాలని పలువురు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News