: ఢిల్లీ బీజేపీ ఎన్నికల ప్రచార కమిటీ నియామకం


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మిగిలిన పార్టీల మాదిరే బీజేపీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఎన్నికల ప్రచారం కోసం 21 మంది నేతలతో కూడిన ప్రచార కమిటీని నియమించింది. ఈ కమిటీకి పార్టీ ఢిల్లీ శాఖ చీఫ్ సతీశ్ ఉపాధ్యాయ్ నేతృత్వం వహిస్తారని ఆ పార్టీ ప్రకటించింది. ఈ కమిటీలో కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తో పాటు ఎంపీలు ప్రవేశ్ సాహిబ్ సింగ్ వర్మ, మీనాక్షీ లేఖి, ఉదిత్ రాజ్, మనోజ్ తివారి, రమేశ్ బిదురి, రాజ్యసభ సభ్యుడు విజయ్ గోయల్, సీనియర్ నేత జగదీశ్ ముఖీ తదితరులున్నారు. గడచిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 31 స్థానాల్లో విజయం సాధించినా, పూర్తిస్థాయి మెజారిటీ లేని కారణంగా ఆ పార్టీ అధికారం చేపట్టలేకపోయింది. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ సన్నాహాలు చేస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో లభించిన వరుస విజయాలతో రెట్టించిన ఉత్సాహంతో ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగనుంది.

  • Loading...

More Telugu News