: చిత్తూరు జిల్లాలో రోడ్డుపై ప్రసవించిన ఏనుగు... కాపలా కాస్తున్న ఏనుగుల గుంపు


చిత్తూరు జిల్లా రామకుప్పం, వి.కోట మండలాల్లోని పొలాలపై ఓ ఏనుగుల గుంపు పడింది. ఈ గుంపులో నెలలు నిండిన ఓ ఏనుగు రోడ్డుపై ప్రసవించింది. మిగతా ఏనుగులు దానికి కాపలాగా నిలవడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. నాయకనేది నుంచి పేర్నంబట్టు మార్గంలో ఈ ఘటన జరిగింది. చిన్న గున్న ఏనుగు, దాని తల్లి క్షేమంగా ఉన్నట్టు సమాచారం. కాగా, గుంపు నుంచి విడిపోయిన ఏనుగు ఒకటి రామకుప్పం మండలం పెద్దూరులో అరటి తోటలను ధ్వంసం చేస్తున్నట్టు తెలిసింది. ఈ ఏనుగును ఎలాగైనా గుంపులో కలిపి అన్నింటినీ అడవుల్లోకి పంపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News