: భోగి సంబరాలు ప్రారంభం... వాడవాడలా భోగి మంటలు
తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబరాలు ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే ఇళ్ల నుంచి బయటకు వచ్చిన యువత పెద్ద ఎత్తున భోగి మంటలను ఏర్పాటు చేసింది. పట్టణాలు, పల్లెసీలమనే తేడా లేకుండా తెలుగు నేల భోగి మంటల వెలుగులో కాంతులీనుతోంది. పాత వస్తువులను మంటల్లో వేసి దహనం చేస్తున్న తెలుగు ప్రజలు కొత్త కాంతుల భోగికి స్వాగతం పలికారు. భోగి మంటల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ, యువత, చిన్నపిల్లలు కేరింతలు కొడుతున్నారు. ఇదిలా ఉంటే, సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడి పందేలకు వివిధ ప్రాంతాల్లో సన్నాహాలు ఊపందుకున్నాయి.