: అరవింద్ కేజ్రీవాల్ పై కోడిగుడ్లు, రాళ్లతో దాడి
ఢిల్లీ తాజా మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగింది. గడచిన ఎన్నికల ప్రచారంలోనూ కేజ్రీవాల్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పూర్ మాజ్రాలో గుర్తు తెలియని దుండగులు ఆయనపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. అయితే దుండగులు విసిరిన కోడిగుడ్లు, రాళ్లు ఆయన ప్రసంగిస్తున్న వేదిక ముందు పడ్డాయి. ఈ ఘటనలో కేజ్రీవాల్ కు ఎలాంటి గాయాలు కాలేదని పార్టీ కార్యకర్తలు చెప్పారు. ఇదిలా ఉంటే, సుల్తాన్ పూర్ మాజ్రాలో అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండోసారి.