: చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు: మంత్రి పల్లె రఘునాథరెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబునాయుడును విమర్శించే అర్హత వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేదని ఏపీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. కొద్దిసేపటి క్రితం చిత్తూరులో మీడియాతో మాట్లాడిన మంత్రి జగన్ పై విరుచుకుపడ్డారు. కుటుంబ సంక్షేమం తప్ప ప్రజల సంక్షేమం పట్టని జగన్, సీఎం కావాలని ఉవ్విళ్లూరుతున్నారని మండిపడ్డారు. వైఎస్ రాజశేఖరరెడ్డికే సీఎం అయ్యేందుకు 30 ఏళ్లు పట్టిందని, జగన్ మాత్రం మూడు రోజుల్లోనే సీఎం కావాలని కలలుగంటున్నారని ఆరోపించారు. జగన్ కలలు కల్లలుగానే మిగిలిపోనున్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న జగన్, కేంద్రంపై మాత్రం నోరు మెదపడం లేదన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తే జైలు తప్పదన్న భావనతోనే జగన్ మిన్నకుండిపోతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.