: ఇస్తాంబుల్ పర్యటనకు రండి: కేసీఆర్ కు టర్కీ ప్రతినిధుల ఆహ్వానం
తెలంగాణ సీఎం కేసీఆర్ తో టర్కీ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. సచివాలయంలోని సీఎం చాంబర్ లో కొద్దిసేపటి క్రితం ముగిసిన ఈ భేటీలో టర్కీ రాజధాని ఇస్తాంబుల్ మేయర్ కూడా పాల్గొన్నారు. ఇస్తాంబుల్ పర్యటనకు రావాల్సిందిగా టర్కీ ప్రతినిధులు కేసీఆర్ కు ఆహ్వానం పలికారు. టర్కీ ప్రతినిధుల ఆహ్వానానికి కేసీఆర్ కూడా సానుకూలంగానే స్పందించినట్లు సమాచారం. మరోవైపు టర్కీ రాయబార కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు అనుమతిచ్చినట్లు కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెలలోనే హైదరాబాద్ లో టర్కీ రాయబార కార్యాలయం కార్యకలాపాలు ప్రారంభించనుందని ఆయన తెలిపారు.