: హిందూ మహిళ ఐదుగురు పిల్లల్ని కనాలి: బీజేపీ నేత శ్యామల్ గోస్వామి


వివాదాస్పద వ్యాఖ్యలతో దేశంలో పెద్ద ఎత్తున చర్చకు తెరతీస్తున్న బీజేపీ నేతల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. దేశంలో మత మార్పిడుల నేపథ్యంలో హిందూ మతాన్ని పరిరక్షించేందుకంటూ ఆ పార్టీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నారు. హిందూ మతాన్ని కాపాడుకునేందుకు ప్రతి హిందూ మహిళ నలుగురు పిల్లలకు జన్మనివ్వాలంటూ ఆ పార్టీ నేత సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలు మరుగున పడకముందే మరో నేత ఈ తరహా ప్రకటనే చేసి సంచలనం రేపారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బీజేపీ నేత శ్యామల్ గోస్వామి తాజాగా వివాదం రేపారు. హిందూ మతాన్ని కాపాడాలంటే ప్రతి హిందూ మహిళ ఐదుగురు పిల్లలను కనాలని ఆయన వ్యాఖ్యానించారు. శ్యామల్ గోస్వామి వ్యాఖ్యలపై విపక్షాలు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నాయి.

  • Loading...

More Telugu News