: గుంటూరు కేంద్రంగా నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు... ముఠా గుట్టు రట్టు!


గుంటూరును కేంద్రంగా చేసుకుని నకిలీ డ్రైవింగ్ లైసెన్సులను రూపొందించి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో డ్రైవింగ్ లైసెన్సులను తయారు చేస్తున్న సదరు ముఠా సభ్యులు, వాటిని హైదరాబాద్ లో విక్రయిస్తున్నారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసిన సందర్భంగా పోలీసులు వారి నుంచి పెద్ద ఎత్తున నకిలీ డ్రైవింగ్ లైసెన్సులు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముఠా సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. నకిలీ డ్రైవింగ్ లైసెన్సులను ఎవరెవరికి విక్రయించారన్న విషయంపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News