: పోప్ ఫ్రాన్సిస్ కు ఘనస్వాగతం
క్యాథలిక్కుల మత గురువు పోప్ ఫ్రాన్సిస్ కు శ్రీలంక నూతన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఘన స్వాగతం పలికారు. రెండు రోజలు పర్యటన నిమిత్తం శ్రీలంక వచ్చిన పోప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, మనవ హక్కులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. గత అధ్యక్షుడు రాజపక్స అధికారంలో ఉండగా, ఎల్టీటీఈ సానుభూతి పరులు, శ్రీలంక తమిళులపై సైనికులు దాష్టీకాలకు పాల్పడ్డారు. ఈ మేరకు ప్రపంచం మొత్తం ఆందోళన వ్యక్తం చేసింది. రాజపక్స అధికారంలో ఉండగా చేసిన అరాచకాలపై గళమెత్తిన మంత్రి వర్గ సహచరుడు మైత్రిపాల సిరిసేన రాజీనామా చేసి, అధ్యక్షుడిపై పోటీ చేసి విజయం సాధించిన సంగతి తెలిసిందే.