: టీఆర్ఎస్ రెబెల్స్ తో నేతల మంతనాలు
టీఆర్ఎస్ లో సీటిచ్చేది లేదు పొమ్మన్నారు. సీటిచ్చేది లేదు... కానీ, రాజకీయ ఉనికి కావాలంటే టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతివ్వాలని హుకుం జారీ చేశారు. దీంతో పేరు ప్రతిష్ఠలున్న అభ్యర్థులు కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో రెబెల్స్ గా బరిలోదిగి సత్తాచాటారు. అధికార, ప్రతి పక్ష పార్టీలను తోసిరాజని, రెబెల్స్ విజయం సాధించారు. నువ్వా నేనే అనేలా సాగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో విజయం సాధించిన రెబెల్ అభ్యర్థులతో టీఆర్ఎస్ నేతలు మంతనాలు సాగిస్తున్నారు. రాజకీయాల్లో సీట్ల తకరారు సర్వసాధారణమేనని పేర్కొంటున్న ఆ నేతలు, రెబెల్ అభ్యర్థులు తమ పార్టీకి చెందినవారేనని కలుపుకుంటున్నారు. దీంతో రెబెల్స్ కి డిమాండ్ పెరిగింది. దీంతో వారు బేరసారాలకు దిగుతున్నారు.