: టెస్టుల్లో ఓడారని టీమిండియాను తక్కువగా అంచనా వేయొద్దు: హస్సీ
ప్రపంచకప్ లో టీమిండియాను తక్కువగా అంచనా వేయొద్దని ఆసీస్ మాజీ క్రికెటర్ మైక్ హస్సీ సూచించాడు. సిడ్నీలో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, టెస్టుల్లో ఓటమిపాలైందని టీమిండియాను తక్కువగా అంచనా వేయవద్దని అన్నాడు. టీమిండియా పుంజుకునే అవకాశం ఉందని హస్సీ అభిప్రాయపడ్డాడు. రెండు నెలల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించిన టీమిండియాకి పిచ్ లపై ఓ అవగాహన ఏర్పడి ఉంటుందని, దాని వల్ల పిచ్ కు అనుగుణంగా వ్యూహాలు రచించి విరుచుకుపడే అవకాశం ఉందని హస్సీ తెలిపాడు. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ అన్న విషయం మర్చిపోవద్దని ఆయన సూచించాడు.