: సచిన్ ను కోహ్లీ అనుసరిస్తున్నాడా?... ఫెడెక్స్ ను కలిసిన కోహ్లీ
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రికార్డులు అధిగమిస్తాడని క్రీడా పరిశీలకులు భావిస్తున్న కోహ్లీ, సచిన్ అభిరుచులను కూడా ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నాడు. ప్రఖ్యాత క్రికెటరైన సచిన్ కు టెన్నిస్ అంటే మక్కువ. వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ పోటీలకు హాజరైమరీ తిలకిస్తుంటాడీ లెజెండ్. అలాగే స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ అంటే సచిన్ కు అభిమానం. తాజాగా ఫెడెక్స్ ను కోహ్లీ కలిశాడు. ఆస్ట్రేలియా ఓపెన్ లో పాల్గొనేందుకు వచ్చిన ఫెదరర్ ను కలిసిన సందర్భంగా కోహ్లీ ఓ ఫొటోను ట్విట్టర్లో పెట్టాడు. కోర్టులో, కోర్టు బయట రోజర్ గొప్ప వ్యక్తి అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు. కోహ్లీతో పాటు, ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ కూడా ఫెదరర్ ను కలిశాడు. ఫెడెక్స్ ను కలవడం గొప్ప గౌవరమని స్మిత్ పేర్కొన్నాడు.