: ఉగ్రవాదంపై భారత్, పాక్ మధ్య ముదురుతున్న వివాదం
పాకిస్థాన్, భారతదేశం మధ్య ఉగ్రవాదం వివాదం ముదురుతోంది. తమకు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని భారతదేశం పెంచి పోషిస్తోందని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి యుద్ధానికి భారత్ పావులు కదుపుతోందంటూ పాక్ చేసిన ఆరోపణలను భారత్ ఖండించింది. పాకిస్థాన్ భారత్ పై చేసిన ఉగ్రవాద దాడులను మరువలేమని స్పష్టం చేసింది. తామెన్నడూ ఉగ్రవాదానికి, ఉగ్రవాదులకు మద్దతివ్వలేదని భారత్ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని గత 24 గంటల్లోనే పాకిస్థాన్ రెండు సార్లు ఉల్లంఘించిందని భారత్ విమర్శిస్తోంది. పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్ భారత్ ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై భారత్ మండిపడుతోంది. చిత్తశుద్ధిగా చర్యలు చేపడితే భారత్ స్వాగతిస్తుందని, లేని పక్షంలో భారత్ దీటుగా స్పందిస్తుందని స్పష్టం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఎప్పట్లానే కొనసాగుతున్నాయి. రిపబ్లిక్ డే ను పాక్ టార్గెట్ చేయడంతో ఎప్పుడు ఎలాంటి దారుణం చోటుచేసుకుంటుందో తెలియడం లేదని అధికారులు ఆందోళన చెందుతున్నారు.