: స్వైన్ ఫ్లూ విజ్రుంభిస్తోంది... సంక్రాంతి, చలికాలం మరింత ప్రమాదం
తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ విజ్రుంభిస్తోంది. గత రెండు నెలలో 124 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వీటిలో జనవరిలో పూర్తయిన ఈ పది రోజుల్లోనే 64 స్వైన్ ఫ్లూ కేసులు ఉండడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో స్వైన్ ఫ్లూ కారణంగా 14 మంది మృతి చెందారని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శీతాకాలం నడుస్తుండడం, దానికి తోడు చలి విపరీతంగా పెరిగిపోవడంతో స్వైన్ ఫ్లూ ప్రబలే ప్రమాదం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ కావడంతో ప్రజలు సమూహాలుగా కలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో స్వైన్ ఫ్లూ ప్రబలే ప్రమాదం ఉందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంట్లోనే ఉండాలని వారు సూచిస్తున్నారు. లేని పక్షంలో వ్యాధి విజ్రుంభించి ప్రాణాలు బలిగొనే ప్రమాదం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.