: ఏపీ ఉన్నత విద్యా మండలికి చట్టబద్దత లేదు: పాపిరెడ్డి


ఏపీ ఉన్నత విద్యా మండలికి చట్టబద్దత లేదని తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక తాము ఉమ్మడి రాష్ట్రంలోని చట్టాలను వర్తింపజేసుకొని మండలిని ఏర్పాటు చేసుకున్నామని ఆయన తెలిపారు. నవంబర్‌ లో జరిగిన ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ విషయంలోనూ సుప్రీంకోర్టు తెలంగాణ ఉన్నత విద్యామండలినే గుర్తించిందని ఆయన తెలిపారు. చట్టాలను గౌరవించి తాము ముందుకు సాగుతున్నామని, అందుకే తాము ఎంసెట్ నిర్వహణకు ఉత్తర్వులు జారీ చేశామని ఆయన చెప్పారు. ఏపీ ఉన్నత విద్యా మండలి ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) తేదీలను ఏకపక్షంగా ప్రకటించి తప్పు చేసిందని ఆయన చెప్పారు. ఎంసెట్ సహా ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అవసరమైతే ఏపీకి కూడా సేవలు అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News