: టీడీపీ నేతలతో ప్రాణహాని: బీసీ సంఘం నేత
టీడీపీ నేతల నుంచి ప్రాణహాని ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బేరుగుల ఉదయ్ కిరణ్ అనంతపురం డీఐజీ, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ దీక్షకు మద్దతు తెలిపినందుకు తనపై తెలుగుదేశం పార్టీ నేతలు కక్షగట్టారని అన్నారు. జిల్లాలో టీడీపీ నేతల దౌర్జన్యాలకు నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించాలని, ఆదోళనలో సీఎం చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.