: ఉగ్రవాద సంస్థలతో చర్చలా?... ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్
ఉగ్రవాద సంస్థలతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, హింసాత్మక చర్యలకు పాల్పడేవారితో చర్చలు జరిపేది లేదని అన్నారు. పాకిస్థాన్ సరిహద్దుల్లో రోజూ ఉగ్రవాదులు దాడులకు తెగిస్తున్నారని, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న తీవ్రవాదాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని క్షమించే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు. చర్చలు జరపాలంటే హింస విడనాడాలని ఆయన పేర్కొన్నారు.